: ఈ రోజును మర్చిపోలేను... జన్మ చరితార్థమైంది: చంద్రబాబు


డబ్బు కంటే నీరు ఎంతో విలువైనదని... జలవనరులను కాపాడుకోలేకపోతే మానవ మనుగడే కష్టమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా-గోదావరి సంగమ ప్రదేశంలో పైలాన్ ను ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఈ రోజును తాను మర్చిపోలేనని... తన జన్మ చరితార్థమయిందని చెప్పారు. వర్షపు నీటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరు ఆలోచించాలని సూచించారు. రానున్న రోజుల్లో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా మారుస్తామని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గోదావరి పుష్కరాల కంటే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News