: రాజ్యాంగాన్ని అమలు చేయండి చాలు: తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వరవరరావు


తెలంగాణ ప్రభుత్వంపై విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు నిప్పులు చెరిగారు. మావోయిస్టు ఎజెండానే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, తెలంగాణలో మావోయిస్టు ఎజెండా అమలు చేయక్కర్లేదని, రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తే చాలని వరవరరావు హితవు పలికారు. వరంగల్ జిల్లా ఎంజీఎం ఆసుపత్రి వద్ద మావోయిస్టుల మృతదేహాలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికార పార్టీ ప్రమాణం చేసిన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ప్రాదేశిక సూత్రాలు అమలు చేస్తే ఎన్ కౌంటర్లు చేయాల్సిన పని లేదని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మావోయిస్టు ఎజెండా అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News