: చిన్నారి ఉసురు తీసిన ఇడ్లీ


ఐదు నెలల ముద్దులొలికే చిన్ని తండ్రికి ఇడ్లీ తినిపిద్దామని తల్లి చేసిన ప్రయత్నం... ఆ చిన్నారి ఉసురు తీసేసింది. హృదయాన్ని కరిగించే ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత పట్టణంలో ఈ ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే పద్మ, వెంకటయ్యలకు పృథ్వీరాజ్ అనే ఐదు నెలల చిన్నారి ఉన్నాడు. ఆ చిన్నారికి ఇడ్లీ తినిపిద్దామని పద్మ ప్రయత్నించింది. ఓ ఇడ్లీ ముక్క చిన్నారి నోట్లో పెట్టగా, అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో, ఊపిరి ఆడక ఆ చిన్నారి విలవిల్లాడిపోయాడు. ఏం చేయాలో అర్థంకాని ఆ తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగానే చిన్నారి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

  • Loading...

More Telugu News