: కేశవరెడ్డి పాఠశాలల్లో సీఐడీ అధికారుల తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేశవరెడ్డి గ్రూప్ కు చెందిన పాఠశాలల్లో సీఐడీ అధికారులు ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని పాఠశాలలో సహా... తిరుపతిలో 6, చిత్తూరులో 2, శ్రీకాకుళంలో 3 బ్రాంచీల్లో ఉన్న రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులతో పాటు బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలిస్తున్నారు. పాఠశాలల నుంచి లభించిన హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం వరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బోధన కొనసాగాలని శ్రీకాకుళంలోని పాఠశాలల సిబ్బందికి సూచించారు. ఇక్కడి పాఠశాలల్లో 2010 నుంచి విద్యార్థులకు సంబంధించిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని తేలింది. డిపాజిట్ల చెల్లింపుల విషయంలో ఇటీవల కేశవరెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.