: రిక్షావాలాలతో సమావేశం కానున్న మోదీ


ఓ చాయ్ వాలాగా జీవితం ప్రారంభించి ప్రధాని స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ ఈ నెల 18న రిక్షావాలాలు, తోపుడుబండ్లు లాగడమే జీవనోపాధిగా ఉన్న నిరుపేదలతో సమావేశం కానున్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వారణాసిలో మోదీ పర్యటించనుండగా, అక్కడ రిక్షా కార్మికులతో ఆయన భేటీ అయి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోనున్న ఆయన జన్ ధన్ పథకం కింద 501 రిక్షాలు, 101 ఈ-రిక్షాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఎంపిక చేసిన 1000 మంది పేదలకు సౌర విద్యుత్ లాంతర్లను ఆయన పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. స్థానిక బీజేపీ నేతలతో సమావేశమయ్యే ఆయన, బెనారస్ హిందూ వర్శిటీలో జరిగే ఓ కార్యక్రమంలో కూడా పాల్గొంటారని, ఆపై బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు.

  • Loading...

More Telugu News