: ఆ ముగ్గురూ సైకోలే: రోజా
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడులపై వైకాపా నాయకురాలు రోజా నిప్పులు చెరిగారు. వీరు ముగ్గురూ సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అభిమాని సూరయ్యను పయ్యావుల సోదరులు చంపడమే కాక, వారి భూములను కూడా లాక్కున్నారని ఆరోపించారు. సూరయ్య కుటుంబాన్ని చూసి ఎందుకు వణికిపోతున్నారంటూ పయ్యావుల సోదరులను ప్రశ్నించారు. ఏపీలో చంద్రన్న అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. తమకు కనీసం ధర్నా చేసే హక్కు కూడా లేదా? అంటూ ప్రశ్నించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.