: ఈజిప్టులో 55 మంది ఉగ్రవాదుల హతం
గత తొమ్మిది రోజులుగా ఈజిప్టు భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. తొలి రోజుల్లో ఉగ్రవాదులు పైచేయి సాధించినా, తాజాగా భద్రతాబలగాలు సత్తా చాటాయి. స్థానిక పోలీసుల సహకారంతో ఈజిప్టు సేనలు టెర్రరిస్టులను ఏరివేస్తున్నాయి. ఈ దాడుల్లో 55 మంది ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మరో 35 మంది ముష్కరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల ఈజిప్టులోని ఓ పురాతన ఆలయాన్ని టెర్రరిస్టులు నేలమట్టం చేశారు. ఈ చర్యలు ఈజిప్టు సైన్యంలో ఆగ్రహావేశాలు పెల్లుబికేలా చేశాయి. దీంతో, టెర్రరిస్టులపై సైన్యం విరుచుకుపడుతోంది.