: ఫెడ్ నిర్ణయం వెలువడకుండానే బాండ్ మార్కెట్ కళకళ!


మరికొద్ది గంటల్లో మొదలయ్యే యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం వెలువడవచ్చని విశ్లేషకులు వేస్తున్న అంచనాలతో అమెరికా బాండ్ల విలువ నాలుగున్నరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. దాదాపు దశాబ్దకాలం తరువాత అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న ఆనందంలో ఇన్వెస్టర్లుండగా, గతంలో అమెరికా జారీ చేసిన బాండ్లకు విలువ పెరిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. యూఎస్ బాండ్ల విలువ 8 బేసిస్ పాయింట్లు పెరిగి 0.815 శాతానికి చేరింది. ఏప్రిల్ 2011 తరువాత బాండ్లకు వచ్చిన అత్యధిక విలువ ఇదే. కాగా, మంగళవారం నాటి సెషన్ లో నాస్ డాక్ సూచిక ఒక శాతానికి పైగా పెరిగింది. బుధవారం నాటి సెషన్లో ఆసియా స్టాక్ మార్కెట్లు ముందుకు దూకాయి. జపాన్ నిక్కీ 1.1 శాతం పెరిగింది. హాంకాంగ్ సూచి 0.96 శాతం, తైవాన్ సూచి 0.88 పెరుగగా, చైనా మార్కెట్ దాదాపు స్థిరంగా నిలిచింది. మరోవైపు భారత స్టాక్ సూచీలు సైతం చెప్పుకోతగ్గ లాభాల్లో నడుస్తున్నాయి. ఉదయం 11:20 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 167 పాయింట్ల లాభాన్ని నమోదు చేసి 25,873 పాయింట్ల వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సూచి 41 పాయింట్లు లాభపడి 7,870 పాయింట్ల వద్ద ఉంది.

  • Loading...

More Telugu News