: రోజాను అరెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న పోలీసులు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్పలో ఈ రోజు వైకాపా నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. వైకాపా నగరి ఎమ్మెల్యే రోజా, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరగనున్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వీరు నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే, వీరి ఆందోళన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. వైకాపా నేతలు బెళుగుప్ప వస్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రోజా, విశ్వేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు వైకాపా నేతలు అనంతపురంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మరోవైపు, ముందస్తు చర్యగా వైకాపా రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామితో పాటు 25 మంది వైకాపా కార్యకర్తలను బెళుగుప్ప పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్నా కోసం వేసిన శిబిరాన్ని కూడా తొలగించారు.