: పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం శుభపరిణామం: వెంకయ్యనాయుడు


కృష్ణానది చెంతకు గోదావరి చేరడంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. పట్టిసీమ ద్వారా నదుల అనుసంధానం శుభపరిణామమని, అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి ఈ కార్యక్రమం శ్రీకారం చుడుతుందన్నారు. నదుల అనుసంధానం అన్నది దేశ ప్రజల చిరకాల కోరిక అని చెప్పారు. ఢిల్లీలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ముందండటం సంతోషదాయకమన్నారు. ఇదే రీతిలో మిగతా రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధిలో పోటీపడాలని వెంకయ్య సూచించారు. పెట్టుబడుల అనుకూల రాష్ట్రాల్లో తెలంగాణ 13వ స్థానంలో ఉన్నప్పటికీ, టీఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు. కాంగ్రెస్ అడ్డుకుంటోంది మోదీని కాదని, దేశాన్ని, దేశ అభివృద్ధిని అని మండిపడ్డారు. యూపీఏ హయాంలో తెచ్చిన బిల్లులకే ఇప్పుడు కాంగ్రెస్ అడ్డుపడుతోందని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News