: మేకపాలోయ్... మేకపాలు... లీటరు రూ. 2 వేలే!
విజృంభిస్తున్న డెంగ్యూ వ్యాధితో దేశ రాజధాని ఢిల్లీలో మేకపాల ధర లీటరుకు ఏకంగా రూ. 2 వేలకు పెరిగింది. డెంగ్యూ వ్యాధి వచ్చిన వారికి మేకపాలు తాగిస్తే, రక్తంలో ప్లేట్ లెట్ల సంఖ్య పెరుగుతుందని నాటు వైద్యులు సలహా ఇస్తుండటమే ఇందుకు కారణం. దీనికితోడు ఢిల్లీ, గుర్గాం తదితర ప్రాంతాల్లో అత్యధిక మేకలు చూలు దశలో ఉండటంతో, మేకపాల కొరత కనిపిస్తోంది. దీంతో సాధారణ రోజుల్లో రూ. 40 వరకూ పలికే మేకపాల ధర ఇప్పుడు చుక్కలు చూపుతోంది. మేకల యజమానులు మాత్రం ఈ పరిణామాలకు సంబరపడుతున్నారు.