: భళా బసవన్నా... 10 గంటల్లో 20 ఎకరాల్లో విత్తునాటిన ఒంటెద్దు!
కాడికి రెండు ఎద్దులను కడితే, ఒక రోజులో ఎన్ని ఎకరాల్లో విత్తనాలు నాటొచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం వ్యవసాయం గురించి కాస్తంత తెలిసిన వారికి సులువుగానే స్ఫురిస్తుంది. ఎద్దులు కాస్తంత బలంగా వుంటే 8 నుంచి 10 ఎకరాల్లో విత్తులు నాటొచ్చు. అదే ఒంటెద్దు కాడి అయితే, మూడో, నాలుగో ఎకరాలన్న సమాధానం వస్తుంది. కానీ, అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలం, గోవిందవాడ గ్రామానికి చెందిన నేమకల్లు రేవప్ప అనే రైతు తన ఒంటెద్దుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. తన ఒంటెద్దు కాడితో ఒక రోజులో 20 ఎకరాల్లో పొద్దు తిరుగుడు విత్తనాలు నాటాడు. ఈ ఘటనను దగ్గరుండి చూసిన రైతులు రేవప్పకు సన్మానం చేసి ఊరేగించడంతో పాటు 'భళా బసవన్నా' అంటున్నారు.