: విలువైన వస్తువులను వదిలేసిన దొంగ... మరి దేన్ని ఎత్తుకెళ్లాడో తెలుసా?


అతడో దొంగతనం కోసం హోటలుకు వచ్చాడు. అక్కడ ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. కానీ ఆ దొంగ దొంగిలించినది ఏంటో తెలుసా? ఓ బస్తాడు ఉల్లిపాయలు మాత్రమే. ఈ ఘటన నేటి తెల్లవారుఝామున హైదరాబాద్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామికవాడలో జరిగింది. ఇక్కడున్న ఓ హోటల్ లో ఉల్లిపాయల బస్తాను దొంగ ఎత్తుకెళ్లాడు. అంతకన్నా విలువైన వస్తువులు ఎన్నో ఉన్నా, వాటన్నింటినీ వదిలి ఉల్లి కోసమే వచ్చినట్టుగా బస్తాను తీసుకెళ్లాడని, ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చామని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ఉల్లిపాయల బస్తా దొంగిలించడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఉల్లి ధర ఆకాశానికి అంటి, సామాన్యునికి దూరమైన తరుణంలో, ఓ దొంగకు ఉల్లిపాయలు మాత్రమే కావాలంటే ఇంకేం చెయ్యాలి మరి?

  • Loading...

More Telugu News