: నేడు, రేపు కుంభవృష్టి, పిడుగుల వర్షం... జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని, పిడుగుల వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలతో మెలగాలని వాతావరణ శాఖ హెచ్చరికలు సాగించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడు, కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి, క్యుములో నింబస్ మేఘాలు కమ్ముకుని ఉండటమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో రాగల 48 గంటల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. వర్షం పడుతున్న సమయంలో పొలం పనుల్లో ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.