: సంపన్న దేశాల జాబితాలో 11వ స్థానంలో భారత్... మన కుబేరుల సంఖ్య ఎంతో తెలుసా?
గత కొద్ది సంవత్సరాలుగా ఇండియాలో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ వెల్త్ మేనేజ్ మెంట్ తాజాగా వెల్లడించిన నివేదికలో 2015 సంవత్సరానికి గాను, సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా 11వ స్థానంలో నిలిచింది. భారత్ లో మొత్తం 1.98 లక్షల మంది సంపన్నులు ఉన్నారని, ఆసియా పసిఫిక్ రీజియన్లో చూస్తే, ఇండియా టాప్-3లో ఉందని ఆర్బీసీ వెల్లడించింది. 2013లో ఇండియా 1.56 లక్షల మంది ధనవంతులను కలిగివుందని గుర్తు చేసింది. ఇక, అత్యధికంగా సంపన్నులు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. అమెరికాలో 43.51 లక్షల మంది ధనికులు ఉన్నారు. రెండో స్థానంలో జపాన్ (24.52 లక్షలు), ఆపై జర్మనీ (11.41 లక్షలు), చైనా (8.90 లక్షలు) టాప్-4లో ఉన్నాయి. మొత్తం మీద భువిపై 1.46 కోట్ల మంది మిలియనీర్లుండగా, వీరి వద్ద 56.4 లక్షల కోట్ల డాలర్ల సంపద ఉంది.