: తెలంగాణ గ్రూప్స్ లో 150 మార్కులు కావాలా? ఇదొక్కటీ చదవండి చాలు!: కోదండరాం
తెలంగాణ ఉద్యమ నేత, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, నిరుద్యోగులకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. త్వరలో జరిగే టీఎస్పీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, తెలంగాణ ఉద్యమం, చరిత్ర గురించి పూర్తి స్థాయిలో చదివి తెలుసుకోవాలని, ఉద్యమంపై పూర్తి అవగాహన, పట్టు ఉన్నవారికి గ్రూప్స్ పరీక్షల్లో 150 మార్కులు వచ్చినట్టేనని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలని, ఉద్యమాన్ని విభాగాలుగా విభజించి వెళ్లాలని సూచించారు. తొలిదశ నుంచి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు, తెలంగాణ కవులు, రచయితలు రాసిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను చదవాలని సలహా ఇచ్చారు. ఈ ఒక్క సబ్జెక్టులో నిష్ణాతులైన నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలను ఒడిసి పట్టుకున్నట్టేనని తెలిపారు.