: చవితి స్పెషల్... హైదరాబాదు నుంచి 245 అదనపు బస్సులు: ఏపీఎస్ ఆర్టీసీ


వినాయకచవితి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలకు అదనపు బస్సులు నడపనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు ప్రతి రోజు నడిచే 480 బస్సులకు అదనంగా మరో 245 బస్సులను కేటాయించామని ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ జయరావు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని చెప్పిన ఆయన, ఇందుకోసం అదనంగా 50 రూపాయలను వసూలు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాదు నుంచి స్వగ్రామాలకు చేరేందుకు ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News