: సోమనాథ్ ను పోలీసులకు లొంగిపొమ్మన్న ఆప్


గృహహింస, హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ భారతిని పోలీసులకు లొంగిపొమ్మని ఆప్ అధిష్ఠానం సూచించినట్టు సమాచారం. సోమనాథ్ భారతి భార్య లిపిక అతనిపై గృహహింస, హత్యాయత్నం కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ముందస్తు బెయిల్ కోసం సోమనాథ్ భారతి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆయన అప్పీలును న్యాయస్థానం తిరస్కరించింది. అయితే సోమనాథ్ భారతి అందుబాటులో లేరని, ఆయనను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం లేదని ఆప్ నేత అశుతోష్ వాపోయారు. ఆయనను పోలీసులకు లొంగిపొమ్మని సూచిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News