: చంద్రబాబు సింగపూర్ పర్యటన ఖరారు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సింగపూర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 20 నుంచి 24 వరకు ఆయన సింగపూర్ లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిపై సింగపూర్ ప్రభుత్వంతో చర్చించనున్నారు. కాగా, సింగపూర్ కు ఈమధ్యే కొత్త ప్రభుత్వం ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని బాబు భావిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రముఖ పాత్ర పోషించనుండడంతో, రాజధాని పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలనే లక్ష్యంతో చంద్రబాబు తాజా పర్యటన జరగనుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News