: ఇస్లాం మతంలోకి మారిపోతాం: బ్రాహ్మణుల హెచ్చరిక
తాము ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణ కులస్థులు హెచ్చరిస్తున్నారు. వీరు చేసిన ఈ వ్యాఖ్యలకు ఇటీవల ఆ గ్రామంలో జరిగిన ఒక సంఘటనే కారణం. ఈ నెల 8వ తేదీన ఓ బ్రాహ్మణ బాలికను దళిత వర్గానికి చెందిన ఒక యువకుడు కిడ్నాప్ చేశాడని సింఘావలీ అహిర్ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజులు గడిచినా కిడ్నాప్ కు గురైన బాలిక ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో ఆగ్రహించిన 150 మంది బ్రాహ్మణులు ఈరోజు ఏఎస్పీ విద్యాసాగర్ విుశ్రాను కలిశారు. ఈ విషయమై పోలీసు అధికారితో మాట్లాడారు. కిడ్నాపైన బాలికను తిరిగి తమకు అప్పగించని పక్షంలో తాము ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ హెచ్చరించారు.