: నీళ్లకు కూడా జగన్ అడ్డుపడుతున్నారు: కేఈ


పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి జలాలను కృష్ణా నదిలోకి తరలించడం ద్వారా రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. నదుల అనుసంధానంతో చంద్రబాబు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. రాయలసీమకు నీళ్లు తెస్తుంటే... ప్రతిపక్ష నేత జగన్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. జగన్ ధ్యాస అంతా సీఎం కుర్చీ మీదే ఉందని... వందేళ్లయినా ఆయన కోరిక తీరదని కేఈ చెప్పారు.

  • Loading...

More Telugu News