: ఆ ర్యాంకులతో మాకేం పని?: కేటీఆర్


ఇండియాలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుకూలంగా ఉన్నాయన్న రాష్ట్రాల జాబితాను ఏ ప్రాతిపదికన రూపొందించారన్న విషయం తనకు తెలియదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాల ర్యాంకులపై ఈ ఉదయం స్పందించిన మంత్రి, వీటిని తాము పట్టించుకోబోమని, అసలీ ర్యాంకులతో తమకు పని లేదని, తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమని ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కాగా, నిన్న వరల్డ్ బ్యాంకు వెల్లడించిన ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానంలో నిలువగా, ఏపీ రెండో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News