: ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం
అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉండగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేస్తారంటూ కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారంటూ ఆది శ్రీనివాస్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై న్యాయస్థానం మంగళవారం విచారణ జరిపింది. చెన్నమనేని ఓటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఈ విషయమై రెండు వారాల్లోగా రమేష్ సమాధానమివ్వాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.