: తలరాతలు మార్చేది దేవుడేనన్న విషయం తెలుసుకో: బాబుకు జగన్ సలహా
చంద్రబాబు తలరాత మారే సమయం ఆసన్నమైందని, అందుకు దేవుడు కూడా సహకరిస్తాడని వైకాపా అధినేత జగన్ వ్యాఖ్యానించారు. తప్పుడు హామీలు, తప్పుడు స్లోగన్లతో అధికారంలోకి వచ్చిన బాబును ప్రజలు ఛీదరించుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ మధ్యాహ్నం తిరుపతిలో జరిగిన యుద్ధభేరిలో పాల్గొన్న ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. దేవుడు ప్రజల పక్షాన ఉన్నాడని, బాబు అక్రమాలు సహించే స్థితిలో ఆయన లేడని అన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలే ఆయన్ను అధికార పీఠం నుంచి కిందకు లాగేయనున్నాయని వివరించారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చిన ఆయన, చరిత్రను తిరగరాసిన అన్ని ఉద్యమాలూ యూనివర్శిటీలే వేదికగా పుట్టాయని గుర్తు చేశారు. విద్యార్థి ఉద్యమాలకు వైకాపా ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు.