: తెలంగాణ చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారు: బీజేపీ నేత లక్ష్మణ్


తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో నిజాం చరిత్రను చేర్చడంపై బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. ఇలా చేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ధ్వజమెత్తారు. తెలంగాణ చరిత్రను సీఎం కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. నిజాంను పొగుడుతూ తెలంగాణ అమరవీరులను అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేసీఆర్ కు ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News