: విద్యార్థినిపై లెక్చరర్ లైంగిక వేధింపులు
మరో కీచక అధ్యాపకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కర్నూల్ జిల్లాలోని బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థినిపై ఉర్దూ లెక్చరర్ అమరుల్లాఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు. ఈ సంఘటనపై కళాశాల విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. కీచక అధ్యాపకుడు అమరుల్లాఖాన్ కు దేహశుద్ధి చేశారు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన అధ్యాపకులు ప్రవర్తన ఈవిధంగా ఉండటం సిగ్గుచేటని పలువురు విమర్శించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు లెక్చరర్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.