: ఐదు సిరంజిలు, రెండు నీడిల్స్ తో పట్టుబడ్డ 'సూదిగాడు'... ఒరిజినల్ ఇతనేనట!


ఎట్టకేలకు కృష్ణా జిల్లా అరిగిపల్లి మండలం సగ్గూరులో ఇంజక్షన్ సైకో పట్టుబడ్డాడు. ఇంతకుముందు పలువురిని అనుమానితులుగా భావించి అదుపులోకి తీసుకున్నా, వారి వద్ద ఎటువంటి సూదులు లేకపోవడంతో వదిలేసిన సంగతి తెలిసిందే. ఈసారి మాత్రం సైకోని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏకంగా ఐదు సిరంజిలు, రెండు నీడిల్స్ తో వెళుతున్న సైకో పేరు శివగా తెలుస్తోంది. ఇతన్ని గమనించిన స్థానికులు పట్టుకోబోగా, వారిని శివ బెదిరించినట్టు సమాచారం. అతన్ని బంధించిన సగ్గూరు వాసులు, ఆపై పోలీసులకు అప్పగించారు. అతని నుంచి ఓ మందు సీసాను కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు, ప్రస్తుతం శివను విచారిస్తున్నారు. ఇతనే ఒరిజినల్ 'సూదిగాడు' కావచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News