: విజయవాడ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలసిన టి.టీడీపీ నేతలు
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును విజయవాడ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి, ఎల్.రమణ తదితరులు చంద్రబాబును కలసినవారిలో ఉన్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన విధానాలు, తెలంగాణ ప్రాంత పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు అభ్యర్థుల ఎంపిక కసరత్తు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణలో రేవంత్ కు టి.టీడీపీ బాధ్యతలు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.