: ముంబైలో పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్
ముంబైలో లోకల్ ట్రైను పట్టాలు తప్పింది. అంధేరి-విలేపార్లే స్టేషన్ల మధ్య లోకల్ ట్రైను 7 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారని తెలిసింది. వెంటనే రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.