: మన విశ్వవిద్యాలయాలకు అరుదైన ఘనత
ప్రపంచంలోని రెండు వందల అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మన యూనివర్శిటీలకు స్థానం దక్కింది. ఆ జాబితాలో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉన్నాయి. ఐఐటీ ఢిల్లీకి 179వ స్థానం, ఐఐఎస్ 147వ స్థానం దక్కించుకున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్ సంస్థ ఈ జాబితాను ప్రకటించింది. అమెరికా చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నెంబర్ వన్ గా నిలిచింది. రెండో స్థానంలో హార్వర్డ్, మూడో స్థానంలో కేంబ్రిడ్జి, స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీలు నిలిచాయి. ప్రపంచంలోని టాప్-50 అత్యుత్తమ యూనివర్శిటీల విషయానికొస్తే లండన్ నగరంలోనే నాలుగు వర్శిటీలున్నాయి. అత్యుత్తమ యూనివర్శిటీల జాబితాలో బోస్టన్, న్యూయార్క్ ల నుంచి మూడేసి యూనివర్శిటీలూ ఉన్నాయి. పారిస్, సిడ్నీ, హాంకాంగ్, బీజింగ్ నగరాల నుంచి రెండు యూనివర్శిటీల చొప్పున ఉన్నాయి.