: కావాలని నేను తప్పు చేయలేదు... అల్లా ఆదేశం లేకుండా ఏమీ జరగదు: సంగీత దర్శకుడు రెహమాన్


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు వ్యతిరేకంగా ముంబైకి చెందిన ఓ ముస్లిం గ్రూప్ ఫత్వా జారీ చేసింది. దీనిపై రెహమాన్ కూడా ఘాటుగానే స్పందించారు. మతం పేరుతో చేసే హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని, కేవలం సహనాన్ని మాత్రమే తాను నమ్ముతానని స్పష్టం చేశారు. 'మహ్మద్ మెసెంజెర్ ఆఫ్ గాడ్' అనే సినిమాకు తాను కేవలం సంగీతాన్ని మాత్రమే అందించానని... ఆ సినిమాకు తాను నిర్మాతను కానని, దర్శకుడిని కానని చెప్పారు. ఇదంతా వృత్తిలో భాగంగానే జరిగిందని... కావాలని తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. మంచి విశ్వాసంతోనే తాను ఆ సినిమాకు మ్యూజిక్ అందించానని చెప్పారు. ఖురాన్ లోని కొన్ని కొటేషన్లను ఉటంకిస్తూ, అల్లా ఆదేశం లేకుండా ఏమీ జరగదని రెహమాన్ అన్నారు.

  • Loading...

More Telugu News