: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అరెస్టు
ఎర్రచందనం స్మగ్లర్ రాజూభాయ్ ను చిత్తూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రోజులుగా ముంబయిలో రెక్కీ నిర్వహించిన పోలీసులు అతన్ని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని చిత్తూరుకు తరలిస్తున్నారు. పలు ఎర్రచందనం కేసుల్లో ముంబయి డాన్ రాజూభాయ్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపిన ఏపీ పోలీసులు ఇప్పటికే పలువురు బడా స్మగ్లర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.