: గొల్లపూడి మారుతీరావుకు ఆపరేషన్ సక్సెస్
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావుకు చేసిన మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. 76 సంవత్సరాల గొల్లపూడి గత కొంతకాలంగా మోకాలి సమస్యలతో బాధపడుతుండగా, ఆయనకు చెన్నైలోని విజయ ఆసుపత్రిలో ఎముకలు, కీళ్ల వైద్య విభాగాధిపతి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆయనకు అత్యాధునిక కృత్రిమ చిప్పలను అమర్చగా, మరుసటి రోజు నుంచే ఆయన నిలబడి నడవగలిగారని రాజశేఖర్ రెడ్డి వివరించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గొల్లపూడి మీడియాతో మాట్లాడుతూ, తనపట్ల డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది చూపిన ఆప్యాయతను మరువలేనని వ్యాఖ్యానించారు.