: గోవులను సంరక్షిస్తామని ప్రతిన బూనిన హైదరాబాద్ ముస్లిం గ్రూప్
బక్రీద్ పర్వదినం నాడు గోవులను హతమార్చకుండా చూస్తామని హైదరాబాద్ కు చెందిన ఓ ముస్లిం యువ గ్రూప్ ప్రతిజ్ఞ చేసింది. పాతబస్తీ పరిధిలోని బార్కస్ ప్రాంతానికి చెందిన 'అరబ్ గోరక్షణ సమితి' (ఏజీఎస్) ఈ మేరకు పిలుపునిచ్చింది. ఇతర మత విశ్వాసాలను దెబ్బతీసే చర్యలను తాము అడ్డుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఏజీఎస్ అధ్యక్షుడు న్యాయవాది అబ్దుల్లా బిన్ అలీ బహమైద్ వెల్లడించారు. హిందూ, ముస్లింల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పడమే తమ లక్ష్యమని, రెండు మతాల మధ్య నమ్మకపు లోటు ఏర్పడితే, అది ఏ దేశాభివృద్ధినైనా కుంగదీస్తుందని అన్నారు. ఇండియాలోని చట్టాల పరంగా కూడా గోమాంస విక్రయం నిషేధమని ఆయన గుర్తు చేశారు.