: ఒబామా వద్దనుకున్న చోటికే వెళ్లాలని నిర్ణయించుకున్న మోదీ!


త్వరలో జరగనున్న అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ న్యూయార్క్ లోని ప్రసిద్ధ 'వాల్ డార్ఫ్ అస్టోరియా' హోటల్ లో ఆతిథ్యం స్వీకరించనున్నారు. ఇదే హోటల్ లో బస చేసేందుకు గతంలో అమెరికా అద్యక్షుడు ఒబామా నిరాకరించడం గమనార్హం. ఆస్టోరియా హోటల్ ను 2014లో చైనాకు చెందిన బీమా కంపెనీ కొనుగోలు చేయడమే ఇందుకు కారణం. తనపై నిఘా ఉంచవచ్చన్న ఉద్దేశంతోనే ఒబామా ఆస్టోరియా హోటల్ లో గడిపేందుకు అంగీకరించలేదు. ముఖ్యంగా వైట్ హౌస్ నుంచి దేశ రక్షణ విభాగానికి చెందిన సమాచారాన్ని చైనా సైబర్ నేరగాళ్లు దొంగిలించారన్న వార్తలు వచ్చిన తరువాత ఈ హోటల్ లో సైతం చైనా సైబర్ నిఘా ఉండవచ్చని యూఎస్ ప్రభుత్వ అధికారులు భావించారు. కాగా, భారత ప్రధాని మోదీతో పాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఇటువంటి భయాలేమీ లేవు. ఈ నెల 23 నుంచి 28 వరకూ అమెరికాలో గడపనున్న మోదీ ఇదే హోటల్ లో బస చేయనున్నారు. పుతిన్ సైతం తన కోసం ఈ హోటల్ ను బుక్ చేసుకున్నారు. యూఎన్ జీఏ ఉన్నత స్థాయి సమావేశాల కోసం న్యూయార్క్ రానున్న చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సైతం ఇక్కడే బస చేస్తారు. ఈ హోటల్ చైనాకు చెందిన అన్ బాంగ్ బీమా కంపెనీ అధీనంలో నడుస్తోంది. ఇదిలావుండగా, న్యూయార్క్ కు రానున్న ఒబామా, సౌత్ కొరియన్ సంస్థ ఈ సంవత్సరం ఆరంభంలో కొనుగోలు చేసిన న్యూయార్క్ ప్యాలెస్ హోటల్ లో బస చేసేందుకు నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News