: మా వల్ల కాదు ... ఇక 'కావేరి'ని పంపలేం!


తమ రాష్ట్రంలోనే కరవు తాండవిస్తున్న ప్రస్తుత తరుణంలో కావేరీ నది నుంచి చుక్క నీరు కూడా తమిళనాడుకు విడుదల చేసే పరిస్థితి లేదని కర్ణాటక సర్కారు కుండబద్ధలు కొట్టింది. గతంలో నిర్దేశించినంతగా కావేరీ జలాలను ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి లేఖలు రాసింది. ఈ సంవత్సరం మొత్తం 198 టీఎంసీల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిన కర్ణాటక, ఇప్పటివరకూ 68 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసింది. దిగువకు నీటి విడుదలలో కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, జయలలిత సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయగా, తమ గడ్డపై వర్షాలు లేనందున నీటి విడుదల కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ముదిరిన కావేరీ జలాల వివాదం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆందోళన పెరిగింది.

  • Loading...

More Telugu News