: కాబోయే భర్తకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న కత్రినా కైఫ్
కాబోయే భర్తకు బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్ ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. రణ్ బీర్ కపూర్ మంచి నటుడని కత్రినా చెబుతోంది. రణ్ బీర్ గత సినిమాలు బేషరమ్, బాంబే వెల్వెట్ సరిగా ఆడకపోవడం విచారించదగ్గదని చెప్పింది. రణ్ బీర్ ఆత్మస్థైర్యంతో కష్టపడి నటిస్తాడని తెలిపింది. రణ్ బీర్ కపూర్, దీపికా పదుకునే నటించిన 'తమాషా' సినిమా విడుదలైన తరువాత, మంచి రోజులు వస్తాయని కత్రినా కైఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్ త్వరలోనే వివాహం చేసుకుని సెటిల్ కానున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి రెండు కుటుంబాలు అంగీకరించినట్టు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.