: గుడివాడ పోలీస్ స్టేషన్ ఎదుట తాగుబోతుల హల్ చల్


కృష్ణా జిల్లా గుడివాడలో ఇద్దరు తాగుబోతులు కత్తులతో పోలీస్ స్టేషన్ ఎదుట హల్ చల్ చేశారు. పూటుగా తాగిన కుమారరాజా, రమణ అనే ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరూ నడి రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదురుగా, కత్తులతో దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు. వీరి ప్రవర్తనతో స్థానికులు భయాందోళనలకు గురికాగా, ఈ వ్యవహారం గమనించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ ప్రారంభించారు. కాగా, వీరి ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News