: ప్రపంచ బ్యాంకు నివేదికపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన రాష్ట్రాలు అంటూ ప్రపంచ బ్యాంకు ఓ జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానం దక్కించుకోగా, తెలంగాణ 13వ స్థానం దక్కించుకుంది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభావవంతంగా పనిచేస్తోందని చెప్పడానికి ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితాయే నిదర్శనమని అన్నారు. తాజా నివేదిక పెట్టుబడిదారుల్లో ఆంధ్రప్రదేశ్ పై మరింత విశ్వాసం నెలకొల్పుతుందని ఆయన వెల్లడించారు.