: ఆస్ట్రేలియాలో పెళ్లైన ఎన్నారై ప్రేమ నిర్వాకం...అరెస్టు


కెనడా పాస్ పోర్టు కలిగి ఉన్న భారత సంతతికి చెందిన అభినవ్ సింగ్ (33) ఇంజనీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను పనిచేస్తున్న సంస్థ యజమాని కుమార్తెకు వందలాది ప్రేమ మెసేజ్ లు, ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజ్ లు పంపేవాడు. అతని వేధింపులు భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆమెను ప్రేమిస్తున్నానని, ఆ విషయం ఆమెకు చెప్పే హక్కు తనకు ఉందని అభినవ్ సింగ్ వాదించాడు. దీనిపై ఆమె తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఆమె ఎన్నడూ సింగ్ ను ప్రేమిస్తున్నట్టు చెప్పలేదని, ఆఫీస్ రికార్డుల్లోని ఆమె నెంబర్ సంపాదించి వేధించాడని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతో లక్షన్నర రూపాయల జరిమానా విధిస్తూ, దేశం విడిచివెళ్లాలని న్యాయస్థానం సింగ్ ను ఆదేశించింది. దీనిపై మాట్లాడుతూ, ఇప్పుడు అధికారికంగా యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎలాగైనా ఆమె ప్రేమను పొందుతానని అభినవ్ సింగ్ తెలిపారు. కాగా, అభినవ్ సింగ్ నిర్వాకం కారణంగా వైద్యురాలిగా పని చేస్తున్న అతని భార్య, ఇద్దరు పిల్లలు ఇబ్బందుల్లో పడ్డారని డిఫెన్స్ న్యాయవాది అభిప్రాయపడ్డారు. అయితే దేశం విడిచి వెళ్లాలని న్యాయస్థానం ఆదేశించడంతో అతనిని ఆస్ట్రేలియాలో ఇమ్మిగ్రేషన్, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖలు అదుపులోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News