: సోమ్ నాథ్ భారతికి బెయిల్ తిరస్కరించిన కోర్టు
గృహహింస, హత్యాయత్నం కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. సోమ్ నాథ్ భారతి బెయిల్ పిటిషన్ ను అడిషనల్ సెషన్స్ జడ్జి సంజయ్ గార్గ్ తిరస్కరించారు. కాగా, సోమ్ నాథ్ భారతి తన భార్యకు, పిల్లలకు అండగా ఉండాలని కోరుకుంటున్నారంటూ ఆయన తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ న్యాయమూర్తికి విన్నవించారు. ‘సోమ్ నాథ్ ను దర్యాప్తునకు సహకరించమని కోరుతూ ఇప్పటికే రెండు నోటీసులు పోలీసులు ఆయనకు పంపించారు. కానీ, పోలీసులకు ఆయన సహకరించడం లేదు’ అంటూ ప్రాసిక్యూషన్ తన వాదనను వినిపించింది.