: టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్... భర్తీ కానున్న 495 ఇంజనీరింగ్ పోస్టులు
మరో 495 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇరిగేషన్, సీఏడీ విభాగంలోని సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 226, ఇరిగేషన్ అండ్ సీఏడీ విభాగంలో మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 26, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ విభాగంలో సివిల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు 243 భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.