: మక్కాలో చనిపోయిన వారికి అక్కడే అంత్యక్రియలు


సౌదీ అరేబియాలోని పవిత్ర మక్కాలో చోటుచేసుకున్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురికీ అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని వారి బంధువులు నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మృతుల అంత్యక్రియలను అక్కడే నిర్వహించాలని జెడ్డాలోని భారత కాన్సులేట్ కార్యాలయాన్ని కోరింది. తెలంగాణ స్టేట్ కమిటీ ద్వారా అబ్దుల్ ఖాదర్, భార్య ఫాతిమాబీ... ప్రైవేట్ టూర్ ఆపరేటర్ ద్వారా షమీమ్ బాను, భార్య ఖాదర్ బీ మక్కా వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో వారు ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు, ప్రమాదంలో గాయపడ్డ నాంపల్లికి చెందిన మహ్మద్ హమీద్ ఖాన్, భార్య అనీస్ లు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

  • Loading...

More Telugu News