: యూఎస్, పశ్చిమ దేశాలపై ఆకస్మిక దాడులు చేయండి: ఆల్ ఖైదా చీఫ్ పిలుపు
ముస్లిం యువకులను రెచ్చగొడుతున్న ఐఎస్ఐఎస్ ప్రకటనలు, కార్యకలాపాలకు కొత్తగా అల్-ఖైదా తోడయింది. అందుకు నిదర్శనం అల్-ఖైదా చీఫ్ ఐమన్ అల్-జవహరి చేసిన ప్రకటనే. యూఎస్, పశ్చిమదేశాలపై అదునుచూసి ఒంటరిగా ఆకస్మిక దాడులు చేయండంటూ ముస్లిం యువకులను రెచ్చగొడుతూ ఒక ప్రకటన చేశారు. అయితే, ఆయా దేశాల్లో దాడుల విషయమై తొందరపడవద్దని కూడా చెప్పారు. జిహాదీని వ్యతిరేకిస్తున్న దేశాలు సిరియా, ఇరాక్ లలో వైమానిక దాడులు జరుగుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ముస్లిం యువతలో ఉగ్రవాద మనస్తత్వ లక్షణాలను నింపే విధంగా జవహరి ప్రకటనలు ఉన్నాయి. ఫ్రాన్స్ లో చార్లీ హెబ్డీ వ్యంగ్య పత్రికపై, బోస్టన్ మారథాన్ పై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల అడుగుజాడల్లో నడవాలంటూ జవహరి తీవ్రమైన ప్రకటనలు చేశారు.