: యూనీలివర్ కంపెనీపై పోరాటం చేస్తున్న తమిళ నటులు


కొడైకెనాల్ చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్న యూనీలీవర్ సంస్థపై తమిళ సినీ నటులు పోరాటం మొదలుపెట్టారు. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక క్షేత్రం కొడైకెనాల్ లో యూనీలీవర్ సంస్థ ధర్మామీటర్లు తయారు చేసే పరిశ్రమను పెట్టింది. దాని నుంచి విడుదలయ్య పాదరసంతో కూడిన వాయువుల కాలుష్యం కారణంగా స్థానికులు ఆరోగ్య సమస్యల బారినపడ్డారు. దీంతో ఆ కంపెనీని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. దీంతో కంపెనీ తరలిపోయింది. అయితే కంపెనీని ఖాళీ చేసిన సదరు సంస్థ అందులోని వేస్టేజీ, ముడి తదితరాలను తీసుకెళ్లలేదు. దీంతో స్థానికులను ఆరోగ్య సమస్యలు వదలడం లేదు. దీంతో తమిళ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకున్న యూనీలివర్ ప్రాడెక్టులను వాడొద్దంటూ తమిళ సినీ నటులు గళమెత్తారు. సినీ నటులెవరూ యూనీలీవర్ ప్రాడెక్టులకు ఎండార్స్ చేయవద్దని, ఆ కంపెనీ వస్తువులను వాడవద్దని, కోడైకెనాల్ ప్రజలకు మనం చేయగలిన సాయం ఇదేనని నటుడు బాబీ సింహ, రోహిణి, కలైరాణి తదితరులు పేర్కొంటున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు ఓ వీడియోను తయారు చేశారు. ఈ వీడియాను కూడా వారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

  • Loading...

More Telugu News