: కొండవీడులో 150 కోట్లతో స్వర్ణ దేవాలయం


గుంటూరు జిల్లాలోని కొండవీడు దగ్గర్లోని చెంఘీజ్ ఖాన్ పేటలో బంగారు దేవాలయం నిర్మాణానికి ఇస్కాన్ రంగం సిద్ధం చేస్తోంది. 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగారు దేవాలయం నిర్మించాలని ఇస్కాన్ భావిస్తోంది. ఈ దేవాలయానికి విజయదశమి రోజున శంకుస్థాపన చేయాలని మూహూర్తం కూడా నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని ఇస్కాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక్కడ గల వేణుగోపాల స్వామి విగ్రహం ప్రపంచంలోనే అరుదైనదని వారు చెబుతున్నారు. ఇక్కడ ప్రతిష్ఠాత్మక దేవాలయం నిర్మాణం నిమిత్తం 60 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వారు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇస్కాన్ గోశాలలను నిర్వహిస్తోంది. ఈ స్వర్ణ దేవాలయం చుట్టూ రామాయణ, మహాభారత గాథలను వివరిస్తూ మ్యూజియం, రోబోలు, ఆడియో, వీడియో విజువల్స్ ఏర్పాటు చేస్తామని ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News