: జెన్ కోను కూడా కోర్టుకు లాగుతా: జగన్
తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైనవారి కుటుంబాలకు రూ. 10 లక్షల వంతున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైకాపా అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరగడంలో ఏపీ జెన్ కో, జెన్ కో కాంట్రాక్టర్ల పాత్ర కూడా ఉందని... కాబట్టి, జెన్ కో కూడా పరిహారం ఇవ్వాల్సిందే అని జగన్ అన్నారు. లేని పక్షంలో జెన్ కోను కోర్టుకు లాగుతామని చెప్పారు. రాజమండ్రిలో బాధిత కుటుంబసభ్యులను జగన్ పరామర్శించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు. లారీలో సరఫరా చేస్తున్న ఫ్లైయాష్ వేడిగా ఉంటుందన్న విషయం కాంట్రాక్టర్లకు కూడా తెలుసని... అయినా అందులోకి మనుషులను ఎక్కించుకోవడం దారుణమని అన్నారు. క్షతగాత్రులకు కూడా పూర్తిగా చికిత్స చేయించి... ఒక్కొక్కరికి కనీసం లక్ష, రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.