: తాడేపల్లిగూడెం మున్సిపల్ సమావేశంలో మిత్రపక్షాల దూషణల పర్వం
మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ శ్రేణులు గొడవకు దిగిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ సమావేశంలో జరిగింది. రెండు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు తీవ్రంగా పరస్పరం తిట్టుకున్నారు. తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయమై వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దూషణల పర్వం తీవ్ర స్థాయికి చేరడంతో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. తమ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి ఉండేది లేదంటూ ఆయన తెగేసి చెప్పారు.