: బీహార్ లో 160 స్థానాల్లోనే బీజేపీ పోటీ... మిగిలిన సీట్లు ఎవరికెన్ని అంటే?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాపరివార్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ కార్యరంగం సిద్ధం చేసుకుంది. మొత్తం సీట్లన్నిటిలో పోటీ చేసే ఆలోచనను విరమించుకున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా ప్రణాళిక రచించారు. మొత్తం 243 సీట్లలో 160 స్ధానాల్లో మాత్రమే పోటీ చేయాలని నిర్ణయించుకున్న అమిత్ షా మిగిలిన 83 సీట్లను మూడు మిత్రపక్షాలకు కేటాయించారు. వీటిలో ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న లోక్ జనశక్తి (ఎల్జేపీ)కి ఏకంగా 40 సీట్లను అమిత్ షా ఇచ్చేశారు. ఎల్జేపీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారులో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక బీహార్ మాజీ సీఎం జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని పార్టీకి 20 సీట్లను కేటాయించారు. మరోవైపు ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి 23 సీట్లను కేటాయిస్తూ అమిత్ షా నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది.