: ఆంధ్రా నాయకులు నిర్లక్ష్యం చేశారు: మండిపడ్డ హరీష్ రావు
గత ప్రభుత్వాల ఆంధ్రా పాలకులు దేవాదుల ఫేజ్ 1,2ను నిర్లక్ష్యం చేశారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పాలకుర్తి రైతులు మంత్రిని కలిసిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాదు, బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రిని రైతులు కలిశారు. ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని 8 గ్రామాలకు నీరందిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు (ఎస్పారెస్పీ) ఫేజ్-2లో నీరు వచ్చేలా చూస్తామని మంత్రి చెప్పారు.